శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 08:31:00

అభి-మోనాల్ మ‌ధ్య అగ్గిరాజేసిన లాస్య‌

అభి-మోనాల్ మ‌ధ్య అగ్గిరాజేసిన లాస్య‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారంతో స‌క్సెస్ ఫుల్ 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఇంట్లో 11మంది స‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా, వీరు ఎప్ప‌టిలానే వారివారి ప‌నుల‌తో బిజీ అయ్యారు. దివి వేసిన బిగ్ బాంబ్ ప్ర‌కారం లాస్య కిచెన్‌లో వంట చేస్తూ క‌నిపిస్తే ఆయ‌న‌కు సాయం చేయాల్సిన అభిజిత్ తింటూ కూర్చున్నాడు. దీంతో అఖిల్‌.. లాస్య‌కి సాయం చేశాడు. ఇక స‌మంత‌ని త‌న బ‌ట్ట‌లు తిరిగి పంపించ‌మ‌ని రిక్వెస్ట్ చేసిన అభిజిత్‌కు బిగ్‌  బాస్ టీం వ‌స్తువుల‌తో బ‌ట్ట‌ల‌ని తిరిగి ఇచ్చేశారు. దీంతో అభిజిత్ సంతోషం వ్య‌క్తం చేస్తూ స‌మంత‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.  

ఇక మార్నింగ్ మ‌స్తీలో భాగంగా బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని త‌మ‌కు నచ్చిన వ్య‌క్తి గురించి పాజిటివ్, నెగెటివ్ అంశాలు రాయాల‌ని అన్నారు. ఆ త‌ర్వాత వాటిని చ‌దివి వినిపించాల‌ని కూడా చెప్ప‌డంతో దాదాపు అంద‌రు పాజిటివ్‌గానే రాసారు. నాతో మాట్లాడుతున్న‌ప్పుడు బాగా క‌నిపిస్తావు, కానీ డైటింగ్ మానేసి తిన‌డం మొద‌లెట్టు అని అభిజిత్ గురించి అఖిల్‌ పాజిటివ్‌గా రాయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురిస్తున్న‌ట్టు క‌నిపించింది.   అనంత‌రం లాస్య, అరియానా, మోనాల్‌లు ప్లాస్టిక్ పూల‌తో బతుకమ్మ ఆడుతుంటే వాళ్లతో జతకలిసి బతుకమ్మ ఆడాడు అవినాష్.  త‌ర్వాత బ‌తుక‌మ్మ‌ని స్విమ్మింగ్ పూల్‌లో వ‌దిలారు.

ఇక ఎప్ప‌టిలాగానే అభిజిత్‌, లాస్య‌, నోయ‌ల్‌, హారిక‌లు గ్రూప్ డిస్క‌ష‌న్ పెట్టారు. లాస్య న‌వ్వుకుంటూ మోనాల్ గురించి స్టిక్స్ వేసింది. అందరి బెడ్ షీట్లు మడత పెట్టి.. నీ బెడ్ షీట్ మడతపెట్టలేదంటే చూడు నువ్వంటే ఎంత స్పెషలో అని అభికి మోనాల్ గురించి కారం మిరియాలు నూరిపోసింది. నోయ‌ల్ కూడా లాస్య‌కు జ‌త క‌లిసి మోనాల్ గురించి చెప్ప‌డంతో కోపోద్రిక్తుడైన అభిజిత్ .. ఆమె మ‌డ‌త పెట్టినా కూడా నేను తీసేస్తా.  ఆమె విష‌యంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను అంటూ మోనాల్‌పై కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.