శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 09:10:03

నీతో మాట్లాడ‌క‌పోతేనే హ్యాపీగా ఉంటా..మోనాల్‌పై అభి ఫైర్

నీతో మాట్లాడ‌క‌పోతేనే హ్యాపీగా ఉంటా..మోనాల్‌పై అభి ఫైర్

బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చిన తొలినాళ్ళ‌లో అభిజిత్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న మోనాల్ గ‌జ్జ‌ర్ ఇప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అఖిల్‌తోనే ఎక్కువ స‌మ‌యం స్పెంట్ చేస్తున్న మోనాల్ రాత్రి స‌మ‌యంలో అభితో ముచ్చ‌టిస్తుంది. ఇక రీసెంట‌గా జ‌రిగిన నామినేష‌న్ స‌మ‌యంలో మోనాల్ టాపిక్ అఖిల్ తీసుకురాగా, దానిని అభి పెద్ద‌ది చేశాడు. దీంతో మోనాల్‌.. అభిజిత్‌, అఖిల్ ఇద్ద‌రిపై ఫైర్ అయింది. నేష‌న‌ల్ ఛానెల్‌లో అమ్మాయిని బ్లేమ్ చేయకండ‌ని కోరింది.

శనివారం ఎపిసోడ్‌లో ఈ విష‌యంపై నాగార్జున ..అభి, అఖిల్ ఇద్ద‌రికి క్లాస్ పీకారు. ఎవ‌రిది త‌ప్ప‌ని నువ్వు భావిస్తున్నావు అని మోనాల్‌ని నాగ్ అడ‌గ‌గా, అందుకు మోనాల్ ఇద్ద‌రిది త‌ప్పే అని చెప్పింది. ఈ విష‌యంపై మోనాల్‌తో సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో చ‌ర్చించారు అభిజిత్. అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ ఉంటే.. నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు.నీ బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా? నాకు నువ్ ఏం చేస్తున్నావో అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నాడు అభి.

అభి ప్ర‌శ్న‌ల‌కు మోనాల్ స‌మాధానం ఇచ్చిన‌ప్ప‌టికీ దానికి సంతృప్తి చెంద‌ని అభిజిత్.. నీతో మాట్లాడ‌క‌పోవ‌డ‌మే నాకు బెట‌ర్ అనిపిస్తుంది. మాట్ల‌డ‌క‌పోతే క‌నీసం ఇద్ద‌రం హ్యాపీగా అయిన ఉంటాం అని అన్నాడు. దీనికి మోనాల్.. కనీసం గుడ్ మార్నింగ్ ,హాయ్‌‌లు అయినా చెప్పుకుందాం అని అభిని అడిగింది..  కాసేపు ఆలోచించుకుని చెప్తా అని ఆమె ద‌గ్గ‌ర నుండి వెళ్లిపోయాడు అభి.

అభిజిత్ బ‌ర్త్‌డే కావ‌డంతో అరియానా అత‌ని  కోసం స్పెషల్ కేక్ ప్రిపేర్ చేసింది. ఈ కేక్‌ని ఇంటి స‌భ్యుల మ‌ధ్య క‌ట్ చేశాడు అభిజిత్. అయితే అప్ప‌టికే నిద్ర‌లోకి జారుకున్న అఖిల్ పార్టీలో పార్టిసిపేట్ చేయ‌లేదు. అంత‌క‌ముందే అభితో వివాదం జ‌ర‌గ‌డంతో మోనాల్ కూడా కాస్త దూరంగా ఉంది.  అయితే మోనాల్‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో సెలైన్స్ ఎక్కించుకుంది. ఇది ఉద‌యాన్నే చేసిన అఖిల్ కాస్త బాధ‌ప‌డ‌డంతో పాటు ఆమెని గ‌ట్టిగా హ‌త్తుకున్నాడు. 

అనంతరం కెప్టెన్‌గా ఉన్న సోహైల్ హౌజ్‌మేట్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేశాడు. రాజ‌శేఖ‌ర్‌తో , అరియానాతో జ‌రిగిన ఇష్యూపై మాట్లాడిన సోహైల్ ఈ వారం మొత్తం ఎలా చేయాలి అనే దానిపై చ‌ర్చించాడు. అయితే కుమార్ సాయి.. సోహైల్‌కు గ‌ట్టిగా మాట్లాడ‌కు , బాగుండ‌దు అని చెప్పాడు. అయితే కుమార్ సాయి వేలు చూపిస్తూ మాట్లాడుతున్న క్ర‌మంలో సోహైల్ వేలు ఎందుకు చూపిస్తున్నావు, దించి మాట్లాడు అని అన్నాడు. ఎన్ని సెంటిమీట‌ర్స్ దించాలంటూ కుమార్ సాయి ఫైర్ అయ్యాడు. ఈ సంద‌ర్భంలో మెహ‌బూబ్ గొడ‌వ పెట్టుకుంటారా, మేట‌ర్‌లో క్లారిటీ తెచ్చుకుంటారా అని చెప్పి ఎవ‌రి పాత్ర‌లు వాళ్ళే వాడుకుందాం అని చెప్పాడు