గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 09:42:56

ఈ ఒక్క‌సారి క్ష‌మించండి.. అభి, హారిక‌ల రిక్వెస్ట్

ఈ ఒక్క‌సారి క్ష‌మించండి.. అభి, హారిక‌ల రిక్వెస్ట్

శనివారం ఎపిసోడ్ నాగ్ ఎంట్రీతో సంద‌డిగా సాగింది. ముందుగా మ‌న టీవీలో ముందు రోజు ఏం జ‌రిగిందో చూపించారు. గార్డెన్ ఏరియాలో మోనాల్‌, అఖిల్‌తో ముచ్చ‌ట్లు పెట్టింది. ఇంట్లో అంద‌రికి క‌నెక్ష‌న్ ఉంది. కాని లాస్య త‌న‌కు క‌నెక్ష‌న్ లేద‌ని బాధ‌ప‌డుతుంద‌ని అఖిల్‌తో చెప్పుకొచ్చింది. దీనికి అఖిల్ నేను అంద‌రితో మంచిగానే ఉంటాను అని అన్నాడు. ఇక అభి, హారిక‌లు మ‌రో చోట గుస‌గుస‌లాడ‌గా, త‌న‌ని మొహ‌మాటం లేకుండా నామినేట్ చేసిన వాళ్ళను వదిలిపెట్ట‌ను అని శ‌ప‌థం చేసింది. 

హారిక‌, అభిజిత్‌ల‌కు అఖిల్ టార్గెట్‌గా మారాడు. త‌న‌ని నామినేట్ చేసినందుకు అఖిల్‌ని నామినేట్ చేస్తా అని హారిక అంటే, అభిజిత్‌.. నేను మోనాల్‌తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అంటే ఈ ఇద్ద‌రు అఖిల్ నామినేట్ చేయాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ తిండికి సంబంధించిన టాస్క్ ఇచ్చారు.  ఫర్ఛ్యూన్ ఆయిల్‌తో వివిధ రకాల వంటకాలు చేసి, వాటిని తినుకుంటూ డ్యాన్స్ చేయాల‌ని అన్నారు. ఈ పోటీలో మెహ‌బూబ్, కుమార్ సాయి పాల్గొన‌గా.. కుమార్ గెలిచాడు.  

ఇక ఇంటి స‌భ్యుల‌తో ముచ్చ‌టించిన నాగార్జున.. కుమార్‌ని అభినందిస్తూ, గంగ‌వ్వ టాస్క్‌లో పాల్గొన‌క‌పోవ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. సామ దాన భేద దండోపాయంలో ఆడాల్సింది కదా అని అన్నారు. అలానే చక్క‌గా తెలుగు మాట్లాడుతున్న మోనాల్‌ని అభినందించాడు. అనంతరం  కిల్లర్ కాయిన్స్‌ టాస్క్‌కి సంబంధించిన‌ ముద్దాయిల‌ని బోన్‌లో ఉంచి పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌శ్న‌లు అడిగేలా సెట‌ప్ చేశారు. 

తొలుత అరియానా.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌ని బోనులో నిల‌బెట్టి త‌ప్పులు చెప్పింది.  రాజశేఖర్ తరుపున అవినాష్ డిఫెన్స్ చేసి వాదించాడు. అయితే ఈ వాదనలో ఎక్కువ మంది రాజశేఖర్ నిర్దోషి అని చెప్పారు. ఇక సుజాత, రాజశేఖర్ మాస్టర్‌లు సొహైల్‌ని దోషిని చేసే ప్రయత్నంగా చేయగా.. ఇంటి సభ్యులు నిర్దోషిగా తేల్చారు.  కుమార్ సాయి.. రాజ‌శేఖ‌ర్‌ని బోనులో నిలుచోబెట్టి త‌ప్పులు చెప్ప‌గా, అత‌నిని దివి డిఫెండ్ చేసింది. అనంతరం.. సోహైల్‌.. దివి త‌ప్పులు చెప్ప‌గా,అఖిల్.. రాజ‌శేఖ‌ర్, అవినాష్‌.. దివిల‌ని బోనులో నిలుచోబెట్టారు. 

అయితే మోనాల్ తెలుగు రాక‌పోయిన ఎంతో ట్రై చేస్తుంది. అభిజిత్‌, హారిక‌.. మీ ఇద్ద‌రికి తెలుగు వ‌చ్చినా కూడా ప‌దే ప‌దే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో చూడండి మీకే అర్ధ‌మ‌వుతుంది అంటూ వారిద్ద‌రు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియో ప్లే చేసి షాక్ ఇచ్చారు. మీరు మాట్లాడే భాష చూసే జనాలకు అర్థం కావడం లేదు. ఇంకోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడితే శిక్షలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు నాగ్. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు ప‌నిష్మెంట్‌గా నిలుచోబెట్టారు నాగ్.

త‌మ త‌ప్పు తెలుసుకున్న అభిజిత్,హారిక‌లు క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇంకో సారి ఇలాంటి త‌ప్పు చేయం. క్ష‌మించండి అంటూ వేడుకున్నారు. దీనికి నాగార్జున హౌజ్‌లో ఎవ‌రు త‌ప్పులు చేసిన ప‌నిష్మంట్ ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. 


logo