సోమవారం 25 మే 2020
Cinema - Feb 20, 2020 , 08:15:45

కండ‌లు తిరిగిన ఈ బాడీ బిల్డ‌ర్ ఎవ‌రో తెలుసా?

కండ‌లు తిరిగిన ఈ బాడీ బిల్డ‌ర్ ఎవ‌రో తెలుసా?

బాక్సింగ్ పోటీల‌కి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు భారీగా కండలు పెంచిన ఈ మ‌హాబ‌లుడిని గుర్తుప‌ట్టారా..!ఈయ‌న మ‌రెవ‌రో కాదు త‌మిళంతో పాటు అడ‌పాద‌డ‌పా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఆర్య‌. వ‌రుడు సినిమాలో బ‌న్నీకి విల‌న్‌గా న‌టించి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. ప్ర‌స్తుతం ఆర్య త‌న 30వ సినిమాని  పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్ట‌ర్స్ అట్ట‌క‌త్తి ఫేమ్ దినేష్‌, క‌లైయ‌ర‌స‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 

తాజాగా ఆర్య త‌న ట్విట్ట‌ర్‌లో కండ‌లు తిరిగిన దృఢ‌కాయంతో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’  అని కామెంట్ పెట్టాడు.  అత‌ని లుక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌ని భార్య సాయేషా సైగ‌ల్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ రోజు సాయంత్రం 5 గం.ల‌కి  ఆర్య పూర్తి లుక్ రివీల్ చేయ‌నున్నారు. మ‌రోవైపు ఆర్య న‌టించిన తాజా చిత్రం టెడ్డీ. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్‌ నటించడం​ విశేషం. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసిన‌ట్టు తెలుస్తుంది. 


logo