ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 14:24:54

నాలుగేళ్లు డిప్రెషన్‌లో ఉన్నా: ఆమిర్ ఖాన్‌ కూతురు

నాలుగేళ్లు డిప్రెషన్‌లో ఉన్నా: ఆమిర్ ఖాన్‌ కూతురు

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌ కూతురు ఐరా ఖాన్ గ‌త ఏడాది ద‌ర్శ‌కురాలిగా ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అమ్మ‌డు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మాన‌సిక స్థితి గురించి తెలిపింది. నాలుగేళ్లుకు పైగా డిప్రెష‌న్‌లో ఉన్న నేను, డాక్ట‌ర్ ద‌గ్గ‌ర ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఏడాదిగా నా మాన‌సిక ఆరోగ్యం గురించి ఏదైన చేయాల‌ని అనుకుంటున్నా కూడా ఏం చేయాలో అర్ధం కాలేదు. అందుకే నా ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని భాగ‌స్వాములు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నేను డిప్రెష‌న్‌లో ఎందుకు ఉన్నాను? ఎందుకు ఇలా చేస్తున్నాను ? అనే విష‌యాలు మీకు చెప్పాల‌ని అనుకున్నాను. దీని వ‌ల‌న మీకు మాన‌సిక ఆరోగ్యంపై ఓ అవ‌గాహ‌న క‌లుగుతుంది అంటూ ఐరా త‌న వీడియోలో పేర్కొంది. 

చాలా మందికి చాలా జ‌రుగుతున్నాయి.అవ‌న్నీ చెప్పాల‌ని ప్ర‌జ‌లు కూడా అనుకుంటున్నారు. కాని ప‌రిస్థితులు గంద‌ర‌గోళంగా, ఒత్తిడితో కూడుకొని ఉన్నాయి. నేను నా మాన‌సిక ఆరోగ్యం, మాన‌సిక అనారోగ్యం గురించి చెబితే కొంద‌రి జీవితంలోనైన మార్పు వ‌స్తుందేమోన‌ని ఈ ప్ర‌య‌త్నం చేశాను అని ఐరా చెప్పుకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే కూడా కొద్ది రోజులు డిప్రెష‌న్‌కి వెళ్లి ఆ తర్వాత కోలుకున్న సంగ‌తి తెలిసిందే. logo