బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 15:27:30

ల‌క్ష్మీ బాంబ్ ట్రైల‌ర్‌పై ఆమిర్ ఖాన్ ప్ర‌శంస‌లు

ల‌క్ష్మీ బాంబ్ ట్రైల‌ర్‌పై ఆమిర్ ఖాన్ ప్ర‌శంస‌లు

అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో  ముని 2కు రీమేక్‌గా హిందీలో ల‌క్ష్మీ బాంబ్ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌గా నటిస్తుంది. న‌వంబ‌ర్ 9న చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు. రీసెంట్‌గా ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది.. దెయ్యాలు, భూతాల‌నేవి లేవు అనే డైలాగ్‌తో ప్రారంభం అయింది. దెయ్యాన్ని చూసిన రోజు నేను గాజులు వేసుకుంటా అంటూ అక్ష‌య్ సీరియ‌స్‌గా డైలాగ్ చెప్పారు. మ‌రో సీన్‌లో ఎరుపు రంగు చీర ధ‌రించి నేను ఎలా ఉన్నాను చెప్పండి. బావున్నా క‌దూ.. న‌న్ను వ‌దులు.. న‌న్ను ముట్టుకోవ‌డానికి నీకెంత ధైర్యం అంటూ అక్ష‌య్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు

హిందీ ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా  లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా,  ఇందులో అక్ష‌య్ కుమార్ ట్రాన్స్‌జెండ‌ర్‌గా అల‌రించ‌నున్నాడు. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచ‌డంతో మూవీ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే కొద్ది సేప‌టి క్రితం మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ల‌క్ష్మీ బాంబ్ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. డియ‌ర్ అక్ష‌య్ కుమార్, ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. సినిమా చూడాలని చాలా ఉత్సుక‌తతో ఉన్నాను. ఇది పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా థియేట‌ర్స్‌లో రిలీజ్ కావాల‌ని కోరుకుంటున్నాను. అక్ష‌య్, మీ న‌టన అద్భుతంగా ఉంది. చిత్ర బృందానికి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని ఆమిర్ ట్వీట్ చేశారు. 


logo