బాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) సోదరుడు ఫైసల్ ఖాన్ (Faissal Khan) గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. యాక్టర్ కమ్ సింగర్ అయిన ఫైసల్ ఖాన్ ఈ సారి డైరెక్టర్ గా తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అయ్యాడు. ఫైసల్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం ఫ్యాక్టరీ (Faactory). ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫైసల్ ఖాన్ వీర ప్రేమికుడిగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఫైసల్ ఖాన్ ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత లవ్ ట్రాక్ లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఫన్నీగా, డిఫరెంట్ గా చూపించేందుకు ప్రయత్నించాడు ఫైసల్ ఖాన్. రోలే ర్యాన్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. సమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
M&S ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఫిలిమ్స్ ఎల్ఎల్పీ, ఫ్లెమింగో ఫిలిమ్స్, గౌరీ ఫిలిమ్స్ తో అసోసియేషన్ లో ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!