గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 01:29:59

టర్కీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’

టర్కీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికి ప్రభుత్వ ఆంక్షల నడుమ భారత్‌తో పాటు విదేశాల్లో సినిమా చిత్రీకరణలు క్రమంగా మొదలవుతున్నాయి. ఇటీవలే అక్షయ్‌కుమార్‌ తన తాజా చిత్రం ‘బెల్‌బాటమ్‌' షూటింగ్‌ను ఇంగ్లాండ్‌లో పునఃప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రీకరణను టర్కీలో తిరిగి ఆరంభించారు. లాక్‌డౌన్‌కు ముందు ఆ సినిమా సగభాగం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత అమీర్‌ఖాన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను అమీర్‌ఖాన్‌ అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.  టామ్‌హాంక్స్‌ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌' చిత్రానికి రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్వైత్‌చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వివిధ కాలాల్లో ఓ వ్యక్తి జీవన గమనానికి దృశ్యరూపంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.logo