కొద్ది రోజుల క్రితం అమీర్ ఖాన్, కిరణ్ రావు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌తో సహ-తల్లిదండ్రులుగా ఉంటామని , అలాగే పానీ ఫౌండేషన్‌పై తమ వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అన్నట్టుగానే విడాకుల ప్రకటన తర్వాత కలిసి కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా లడాఖ్‌లో అమీర్, కిరణ్ ఫోక్ డ్యాన్స్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అమీర్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా ప్రస్తుతం లడాఖ్‌లోని వాఖా అనే గ్రామంలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్గా చిత్ర షూటింగ్ ముగియడంతో అక్కడి ప్రజలు టీమ్‌కి సాదర స్వాగతం పలికారు. అనంతంరం అమీర్, కిరణ్ రావు సంప్రదాయ దుస్తులు ధరించి గ్రామీణులతో జానపద నృత్యం చేశారు. గ్రామీణుల మాదిరిగానే వారు స్టెప్పులు వేస్తూ అలరించారు.
ప్రస్తుతం లడాఖ్ లో గ్రామీణులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత చైనా సరిహద్దుల వద్ద గల ఈ ప్రాంతంలో ప్రజలు తమ ఫోక్ డ్యాన్స్ సందర్భంగా ధరించే డ్రెస్సులను కోస్, సల్మా అంటారట.. గొంబా సమ్ షాక్ అనే పాపులర్ డ్యాన్స్ అనే దీన్ని దశాబ్దాలుగా చేస్తుంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ గొంబా సమ్ షాక్ అనే డ్యాన్స్ తమతో చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.