సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 00:11:14

అలనాటి ఆకాశవాణి

అలనాటి ఆకాశవాణి

అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా  ఏయూ అండ్‌ ఐ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి’.  పద్మనాభరెడ్డి  నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో రానా ఆదివారం విడుదలచేశారు. ఇందులో మర్రిచెట్టు ఊడలను పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతున్న ఓబాలుడు రేడియో వింటూ కనిపిస్తున్నాడు. అద్భుతమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన మంచి టీమ్‌ కుదిరిందని హీరో రానా తెలిపారు. ‘పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు.  జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన అశ్విన్‌ గంగరాజు విభిన్నమైన ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. logo