బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 11:35:57

సూర్య 'ఆకాశం నీ హ‌ద్దురా' ట్రైల‌ర్ విడుద‌ల‌

సూర్య 'ఆకాశం నీ హ‌ద్దురా' ట్రైల‌ర్ విడుద‌ల‌

త‌మిళ హీరో సూర్య న‌టించిన త‌మిళ చిత్రం శూర‌రై పోట్రు. ఈ చిత్రాన్ని  తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య ..రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి నిర్మించారు. అక్టోబర్‌ 30న ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్న చిత్ర బృందం  నవంబర్ 12కు రిలీజ్ డేట్‌గా మార్చింది.

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథను తెలియజేసిన పుస్తకం 'సింప్లి ఫై క‌ల్పిత వ‌ర్షెన్ ఆధారంగా సినిమాని తెర‌కెక్కించారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఓ సామాన్య యువకుడు ఎయిర్‌ఫోర్స్‌ ఫైలైట్‌ అవుతాడు.  విమాన సంస్థను ప్రారంభిచాలనుకునే క్ర‌మంలో ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తాడు అనే నేప‌థ్యంతో సినిమాని రూపొందించిన‌ట్టు ట్రైల‌ర్‌చూస్తే అర్ధ‌మ‌వుతుంది. మీరు ఈ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి .