శనివారం 30 మే 2020
Cinema - May 02, 2020 , 09:11:47

ర‌చయిత‌, ద‌ర్శకురాలు, న‌టి, ఎడిట‌ర్ అన్నీ రేణూ కూతురేన‌ట‌..!

ర‌చయిత‌, ద‌ర్శకురాలు, న‌టి, ఎడిట‌ర్ అన్నీ రేణూ కూతురేన‌ట‌..!

ప‌వ‌న్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. త‌ర‌చూ త‌న‌కి సంబంధించిన వీడియోలు లేదంటే పిల్ల‌ల‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని అందింప‌జేస్తుంది. తాజాగా త‌న కూతురు ఆద్య చేసిన ఓ వీడియోని షేర్ చేస్తూ.. దీనికి ర‌చయిత‌, ద‌ర్శకురాలు, న‌టి, ఎడిట‌ర్ అన్నీ ఆద్య‌నే అనే కామెంట్ పెట్టింది రేణూ దేశాయ్.

రేణూ షేర్ చేసిన వీడియోలో ఆద్య డాక్ట‌ర్‌గా, పేషెంట్‌గా ద్విపాత్రిభినయం చేసింది . 'ఐ హావ్ సమ్ బ్యాడ్ న్యూస్'.. 'ఐ హావ్ సమ్ రియల్లీ బ్యాడ్ న్యూస్' అంటూ ఆద్య చెబుతున్న‌ డైలాగులు మెగా ఫ్యాన్స్‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిన్నారి రానున్న రోజుల‌లో మంచి మ‌ల్టీ టాలెంటెడ్ గా ఎద‌గాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు. ఇక రేణూ త‌న‌యుడు అకీరా ఇప్ప‌టికే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోగా, ఈ కుర్రాడిని హీరోగా చూడాలని ప‌వ‌న్ అభిమానులు భావిస్తున్నారు .logo