సోమవారం 21 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 08:52:48

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత నాపై శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నారు..!

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత నాపై శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నారు..!

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లోనే కాక రాజ‌కీయాల‌లోను క‌ల‌క‌లం రేపుతుంది. సుశాంత్ మ‌ర‌ణానికి కొంద‌రు పెద్ద‌లే కార‌ణ‌మంటూ ప‌లువురు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో కేసుని లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ మ‌ధ్య సుశాంత్ మ‌ర‌ణించే రోజు ముందు ఆదిత్య ఠాక్రే అక్క‌డే ఉన్నాడ‌ని, వారు క‌లిసి పార్టీ చేసుకున్నార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ కూడా ప్ర‌పంచంలోని గొప్ప ముఖ్య‌మంత్రి త‌న‌యుడు సుశాంత్ మ‌ర‌ణించే ముందు రోజు జ‌రిగిన పార్టీలో పాల్గొన్నాడ‌ని వ్యాఖ్యానించింది. ఈ విష‌యం అంద‌రికి తెలుసు. కాని ఎవ‌రు చెప్పరు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై తాజాగా స్పందించారు మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కొంద‌రు శ‌వ రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి నాకు చాలా మందితో ప‌రిచయాలు ఉన్నాయి. అవి నేరం కాదు కదా. హిందూ హృద‌య సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే మ‌న‌వ‌డిని అయిన నేను మహారాష్ట్ర గౌరవానికి, శివసేన, థాక్రే కుటుంబానికి మచ్చ తెచ్చే ప‌నులు ఏ మాత్రం చేయ‌న‌ని స్ప‌ష్టం చేశాడు ఆదిత్య థాక్రే. సుశాంత్ మ‌ర‌ణించడానికి, నాకు ఎలాంటి సంబంధం లేదు. కాని కొంద‌రు కావాల‌ని నాకు చెడ్డ పేరు తెచ్చేలా చెత్త రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు ఆదిత్య‌


logo