శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 23, 2020 , 22:56:36

యాక్షన్‌ అంశాల ‘బ్లాక్‌'

యాక్షన్‌ అంశాల ‘బ్లాక్‌'

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్లాక్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జి.బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్‌ నిర్మాత. దర్శనాబానిక్‌ కథానాయిక. లాక్‌డౌన్‌కు ముందు 70శాతం చిత్రీకరణ పూర్తిచేశారు. మిగతా షూటింగ్‌ను లాక్‌డౌన్‌ అనంతరం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆది గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. ఆయన పాత్ర చిత్రణలో నవ్యత కనిపిస్తుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ అంశాలతో మెప్పిస్తుంది. ఆది కెరీర్‌లోనే ఓ మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకం ఉంది. లాక్‌డౌన్‌ అనంతరం శరవేగంగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. కౌశల్‌, ఆమని, వెన్నెల కిషోర్‌, శ్యామ్‌కృష్ణ, సూర్య, చక్రపాణి, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, రచన-దర్శకత్వం: జీబీ కృష్ణ.


logo