ఆది సాయికుమార్ పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘అమరన్ ఇన్ ది సిటీచాప్టర్-1’ అవికాగోర్ నాయిక. ఎస్.బాలవీర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఇప్పటివరకు రాని సరికొత్త కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ ప్రారంభించాం’ అన్నారు. ఆదిత్యం ఓం, కృష్ణుడు, మనోజ్ నందన్, వీరశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: జెమిని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: శ్వేతా కటకం.