‘కంటికి కనిపించని కాలయముడు లాంటి శత్రువు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ఓ పోలీస్ ఎలా బయటపడ్డాడు? కాలసర్పంలా దూసుకొస్తున్న సమయంలో సమస్యల వలయాన్ని ఎదురించి అతడు ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్’. జీబీ కృష్ణ దర్శకుడు. మహంకాళీ దివాకర్ నిర్మాత. దర్శణ బానీక్ కథానాయిక. ఇటీవల ఈచిత్ర టీజర్ విడుదలైంది. శత్రువును అన్వేషిస్తూ ఆది సాగించిన ప్రయాణంతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత తెలిపారు.