బుధవారం 03 జూన్ 2020
Cinema - May 19, 2020 , 12:14:33

యంగ్ హీరోని ఎత్తుకున్న మెగాస్టార్..పిక్ వైరల్

యంగ్ హీరోని ఎత్తుకున్న మెగాస్టార్..పిక్ వైరల్

లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా మంది సినీ సెల‌బ్రిటీలు త‌మ పాత జ్ఞాపకాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిన్న‌ప్ప‌టి ఫోటోల‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్‌కి గురి చేస్తున్నారు. తాజాగా సాయి కుమార్ త‌న‌యుడు ఆది చిన్న‌ప్పుడు చిరంజీవితో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ పిక్ వైర‌ల్‌గా మారింది.

1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కలికాలం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మధ్య తరగతి మనుషుల సాధక బాధల ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రంలో చంద్ర మోహన్, జయసుధ ప్రధాన పాత్రలు చేయగా, హీరో సాయి కుమార్ ఓ కీలక రోల్ పోషించారు. ఈ సినిమా వంద రోజుల వేడుక‌లో తండ్రి సాయికుమార్ బ‌దులు ఆది .. చిరు చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. పాత జ్ఞాప‌కాన్ని ఆది తాజాగా గుర్తు చేసుకుంటూ ఫుల్ ఖుష్ అవ‌తున్నారు. ఆది నటించిన జంగిల్, శశి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  


logo