శనివారం 30 మే 2020
Cinema - May 07, 2020 , 13:13:45

సోనూ నిగ‌మ్ పాడిన మ‌హాభార‌తం టైటిల్ సాంగ్‌.. వీడియో వైర‌ల్‌

సోనూ నిగ‌మ్ పాడిన మ‌హాభార‌తం టైటిల్ సాంగ్‌.. వీడియో వైర‌ల్‌

బాలీవుడ్ ప్ర‌ముఖ గాయ‌కుడు సోనూ నిగ‌మ్ పాట‌ల‌కి ప‌రవశించ‌ని వారు ఉండ‌రు. ఎన్నో అద్భుత‌మైన సాంగ్స్ ఆల‌పించిన సోనూ నిగ‌మ్ గ‌తంలో బీ ఆర్ చోప్రా తెర‌కెక్కించిన మ‌హాభార‌తంకి టైటిల్ సాంగ్ పాడారు. ఇండోర్‌లోని టాకటోరా స్టేడియంలో చిత్రనిర్మాత బిఆర్ చోప్రా సమక్షంలో 'మహాభారతం' అనే పురాణ ధారావాహికకి టైటిల్ సాంగ్ పాడాను అంటూ సోను ఒక వీడియో షేర్ చేశారు. కొద్ది నిమిషాల‌లోనే ఈ వీడియో వైర‌ల్ అయింది. ఇందులో సోను యువ‌కుడిగా క‌నిపిస్తున్నారు.

లాక్ డౌన్ వ‌ల‌న ప్ర‌స్తుతం రామానంద్ సాగ‌ర్ రామాయ‌ణం, బీఆర్ చోప్రా మ‌హాభార‌తం దూర‌ద‌ర్శ‌న్ తిరిగి ప్ర‌సారం అవుతుంది. ఇవి 80,90ల కాలం నాటి ప్రేక్ష‌కుల‌నే కాక ఈ త‌రం ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. టాప్ రేటింగ్ సాధిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి  .logo