మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 01:54:34

రంగులు మార్చే లోకం

రంగులు మార్చే లోకం

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపటధారి’. ప్రదీప్‌కృష్ణమూర్తి దర్శకుడు. కన్నడంలో విజయవంతమైన ‘కావలుధారి’ సినిమాకు రీమేక్‌ ఇది. డా॥ ధనంజయన్‌ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను గురువారం యువహీరో రానా విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నింటికి ఓ కారణం ఉంటుంది’ అనే పాయింట్‌ ఆధారంగా టీజర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో ఓ హత్య కేసును పరిశోధించే ట్రాఫిక్‌ పోలీస్‌గా సుమంత్‌ కనిపిస్తున్నారు. చివరగా ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అనే పాటతో పాటు... రంగులు మార్చేలోకం. పాచికలాడే న్యాయం.నీతి నియమం మరిచి జీవితమంటే యుద్ధం పోరాడటమే లక్ష్యం. కన్నులు కప్పి తిరిగేవాడేరా” అనే బ్యాక్‌గ్రౌండ్‌ గీతం ఆసక్తినిరేకెత్తిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర  కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భాష్యశ్రీ, సంగీతం: సైమన్‌కింగ్‌, స్క్రీన్‌ప్లే అడాప్షన్‌: డా॥ జి.ధనంజయన్‌, కథ: హేమంత్‌ ఎం రావు, దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి.