శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 15:44:46

సుశాంత్ కేసు.. ఎన్‌సీబీ బృందంతో న్యాయ‌వాది వాగ్వాదం: వీడియో

సుశాంత్ కేసు.. ఎన్‌సీబీ బృందంతో న్యాయ‌వాది వాగ్వాదం: వీడియో

హైద‌రాబాద్‌: ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఇవాళ డ్ర‌గ్ డీల‌ర్ కైజ‌న్ ఇబ్ర‌హీంను అదుపులో తీసుకున్న‌ది.  సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తితో.. డ్ర‌గ్స్ గురించి ఇబ్ర‌హీం చాట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దానికి సంబంధించిన చాట్ డేటా ఎన్‌సీబీ వ‌ద్ద ఉన్న‌ది. అయితే ఇవాళ ఎన్‌సీబీ బృందం త‌మ వాహ‌నంలో కైజన్ ఇబ్ర‌హీంను తీసుకువెళ్తున్న స‌మ‌యంలో.. అత‌ని త‌ర‌పున న్యాయ‌వాది వాహ‌నాన్ని అడ్డుకున్నారు. ఇబ్ర‌హీంను తీసుకు వెళ్ల‌వద్దు అంటూ వాగ్వాదానికి దిగాడు. కైజ‌న్ ఇబ్ర‌హీంకు ఇవాళ ఉదయం డ్ర‌గ్స్ కేసులో 14 రోజుల జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించారు. అయితే ఆ త‌ర్వాత‌ ముంబై కోర్టు కైజ‌న్‌కు బెయిల్ మంజూరీ చేసింది.  ఈ నేప‌థ్యంలో కైజ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది .. ఎన్‌సీబీ వాహ‌నాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. డ్ర‌గ్స్ కోణం ప‌లు మ‌లుపులు తిరుగుతున్న‌ది.  ఈ కేసులో ఇప్ప‌టికే రియా సోద‌రుడు శౌవిక్‌, సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ సామ్యూల్ ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది.