మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 19, 2020 , 09:39:55

బ‌య‌టకు వచ్చాక పెళ్లి చేస్తాన‌ని అవినాష్‌కు ధైర్యం చెప్పిన త‌ల్లి

బ‌య‌టకు వచ్చాక పెళ్లి చేస్తాన‌ని అవినాష్‌కు ధైర్యం చెప్పిన త‌ల్లి

బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎపిసోడ్ 74లో ఇంటి స‌భ్యుల త‌ల్లులు ఒక్కొక్క‌రుగా ఇంట్లోకి ప్ర‌వేశిస్తుండ‌డంతో అంద‌రు ఎమోష‌నల్ అయ్యారు. చివ‌రిగా అవినాష్ అమ్మ మ‌ల్ల‌వ్వ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కొడుకుని చూసి తెగ మురిసిపోయిన మ‌ల్ల‌వ్వ అంద‌రు మంచిగా ఉండాల‌ని ప్రార్దిస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న‌. మంచిగా ఆడు. బాగా ఆడుతున్నావ్.  న‌న్ను సెల్ఫీలు అడుగుతున్నారంటూ ముచ్చ‌టించింది.

అంద‌రితో స‌రదాగా మాట్లాడిన  మ‌ల్ల‌వ్వ త‌న ఇంటికి వ‌స్తే మ‌ట‌న్ కూర వండిపెడ‌తాన‌ని మాట ఇచ్చింది. ఇక ఇంటి స‌భ్యుల‌ని ఉత్సాహ‌ప‌రిచేందుకు స్టెప్పులు కూడా వేసింది. అయితే ఊరికే పెళ్లి పెళ్లి అంటున్న అవినాష్‌కు బ‌యట‌కు వ‌చ్చాక పెళ్లి చేస్తానంటూ ఆమె త‌ల్లి ధైర్యం చెప్పింది. దీంతో ఫుల్ ఖుష్ అయ్యాడు అవినాష్‌. 

ఇక  త‌ల్లి రెండు మోకాళ్లు అరిగిపోయి న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నా ఆమె ఇప్పుడు మంచిగా న‌డుస్తున్నందుకు సంతోషించాడు అవినాష్‌. త‌న త‌ల్లి బాధ‌ను అరియానాతో షేర్ చేసుకున్నాడు. మొత్తానికి త‌ల్లుల రాక అంద‌రిని క‌ల‌ప‌డంతో పాటు ఇంటి వాతావ‌ర‌ణాన్ని ఆహ్లాద‌క‌రంగా మార్చింది. ఈ రోజు మ‌రికొంత‌మంది కంటెస్టెంట్స్ త‌ల్లులు హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. 


logo