మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 10:19:54

బిగ్ బాస్ 4: మిత్రులుగా మారిన బ‌ద్ధ శత్రువులు!

బిగ్ బాస్ 4:  మిత్రులుగా మారిన బ‌ద్ధ శత్రువులు!

బిగ్ బాస్ సీజ‌న్ 4లో 48వ ఎపిసోడ్ స‌ర‌దాగా సాగింది. ముందు చిన్న‌పాటి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . ఈ టాస్క్ ప్ర‌కారం కంటెస్టెంట్స్ మ్యాట్రెస్ పై ప‌డుకోవ‌ల‌సి ఉంది, ఎవ‌రు చివ‌ర‌కు ఉంటారో వారికి బెడ్‌పై ప‌డుకునే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని చెప్పారు. టాస్క్ ప్రారంభం కాగా,  అంద‌రు ఒకరినొక‌రు మ్యాట్రెస్‌పై నుండి తోసుకున్నారు. చివ‌ర‌కు దివి మ్యాట్రెస్‌పై ఉండ‌డంతో ఆమెకు స్పెష‌ల్ ఆఫ‌ర్ ద‌క్కింది.

అనంత‌రం బిగ్ బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీయాల‌ని ఆదేశాలు రాగా, ఇందులో అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా దివి, స్క్రిప్ట్ రైటర్ గా అవినాష్, డీఓపీగా నోయల్, కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్, మేకప్ & స్టైలిష్ట్‌గా లాస్య, ఐటమ్ సాంగ్ డాన్సర్స్ గా - హారిక, సోహైల్‌ ఉంటారని ప‌లు రోల్స్ ఇచ్చారు.  అవినాష్ స్క్రిప్ట్ రైటింగ్‌తోపాటు యాక్టింగ్ కూడా చేయొచ్చు అని అన్నారు.   సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. అలాగే.. సినిమాలో బిగినింగ్, మిడిల్, మంచి క్లైమాక్స్ ఉండేలా చూసుకోవాలి అని చెప్ప‌డంతో ఎవ‌రి పనిలో వారు బిజీ అయ్యారు.

ఇప్ప‌టి వ‌ర‌కు హౌజ్‌లో బ‌ద్ద శ‌త్రువులు మాదిరిగా క‌నిపించిన అఖిల్‌, అభిజిత్‌లు  తాజా టాస్క్‌లో స‌ర‌దాగా కనిపించారు. ఇద్ద‌రు క‌లిసి మోనాల్‌ను ఏడిపించ‌డం, సినిమా పూర్తైన త‌ర్వాత తిరిగి మిత్రులుగా మార‌డం ప్రేక్ష‌కుల‌కు చూడ‌ముచ్చ‌ట‌గా కనిపించింది. ఇక మొన్న‌టి వ‌ర‌కు మోనాల్‌తో మాట్లాడ‌ని అభిజిత్ ఈ  టాస్క్ కోసం ఆమెతో మాట్లాడ‌డ‌మే కాదు స‌ర‌దాగాను ఉన్నారు. 

ఐట‌మ్ సాంగ్  విష‌యంలో అభిజిత్‌, మాస్ట‌ర్‌కు చిన్న‌పాటి వివాదం న‌డిచింది. సాంగ్ చేసేటప్పుడు డాన్సర్స్, డీఓపీ మాత్రమే కొరియోగ్రాఫర్‌తో ఉండాలని.. డైరెక్టర్ రావ‌డానికి వీల్లేదని నిబంధనల్లో ఉన్నట్టు అమ్మ రాజశేఖర్ గుర్తుచేశారు.  ‘‘ఇప్పుడేంటి డైరెక్టర్ రావద్దు అంటున్నారు అంతేగా’’ అని అభిజీత్ యాటిట్యూడ్ చూపించారు. ఈ స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ కాస్త ఫైర్ అయ్యాడు. చెప్పిన‌దే ప‌ది సార్లు చెపుతున్నావ్ అంటూ మండిప‌డ్డారు.

 ఇక బిగ్ బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో అఖిల్‌-మోనాల్‌లు రొమాంటిక్ సీన్‌లో తెగ జీవించ‌గా, అరియ‌నా-అవినాష్ ఓ సీన్‌ని పండించారు. నోయ‌ల్ విల‌న్‌గా విశ్వ‌రూపం చూపించాడు. ఐటం డ్యాన్స‌ర్స్ గా హారిక‌, సోహైల్‌లు మెప్పించారు. ఇక లాస్య ట‌చ‌ప్ చేస్తూ కొంత హాస్యాన్ని పండించింది. 'బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు తోపు ద‌మ్ముంటే ఆపు' అని  ప్రాస‌తో ఉన్న టైటిల్ లాస్య చెప్ప‌గా మాస్ట‌ర్, మోనాల్‌ బాగుంద‌ని మెచ్చుకున్నారు.  మొత్తానికి  సినిమాని కంప్లీట్ చేసిన హౌజ్ మేట్స్ రిలాక్స్ అయ్యారు.

ఇక అడ్వటోరియల్ టాస్క్‌లో గెలుపొందిన దివి విజేత‌గా నిలిచిన కార‌ణంగా ఆమెకు మెత్త‌టి ప‌రుపుపై ప‌డుకునే అవ‌కాశం ద‌క్కింది. ఓ గంట ఎక్కువ ప‌డుకునే అవ‌కాశం కూడా దివికి ఉన్నందున ఆమె తెగ సంతోషించింది. ‌