శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 11:27:53

నెల రోజుల క్రితం మ‌ర‌ణించిన సుశాంత్.. ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్ పోస్ట్

నెల రోజుల క్రితం మ‌ర‌ణించిన సుశాంత్.. ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్ పోస్ట్

స‌రిగ్గా నెల రోజుల క్రితం అంటే జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంకి పాల్పడ్డ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ వార్త ఎంద‌రికో తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ప్ర‌తి రోజు అభిమానులు, స‌న్నిహితులు ఆయ‌న‌కి సంబంధించిన జ్ఞాప‌కాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా దిల్ బెచారా ద‌ర్శ‌కుడు ముకేష్ చ‌బ్రా సెట్‌లో సుశాంత్‌తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టాడు.

నెల రోజులు అయింది. మీ ద‌గ్గ‌ర నుండి ఫోన్ కూడా రాదు అంటూ ముకేష్ పేర్కొన్నారు. సుశాంత్ చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌ను ప్రేక్షకులు భారీ ఎత్తున వీక్షిస్తూ లైక్స్‌ కొడుతున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' కు రీమేక్‌గా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖేష్‌ ఛాబ్రా దర్శకుడు. సంజనా సంఘి కథానాయికగా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ హృదయాన్ని స్పృశించేలా సాగింది. జీవితం చివరి అంకంలో ఉన్న ఇద్దరు టెర్మినల్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌ మధ్య నడిచే ప్రేమకథా ఇతివృత్తంతో మనసును తడిమే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 24న ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది.  logo