శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 00:06:28

మహిళలకు సందేశం!

మహిళలకు సందేశం!

రాంకీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెంప్ట్‌రాజా’. దివ్యరావ్‌, ఆస్మ నాయికలు.సే క్రియేషన్స్‌ పతాకంపై  లేడి ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రాంకీ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాంకీ మాట్లాడుతూ ‘అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే హంగులు ఇందులో వున్నాయి. అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్‌ని ఆకర్షించే అంశాలు ఎక్కువగా వున్నాయి. ఈ చిత్రంలో వుండే సందేశం ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసే విధంగా వుంటుంది. పోసాని కృష్ణమురళి పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది’ అన్నారు.


logo