గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Aug 21, 2020 , 15:17:50

ప్ర‌భాస్‌పై జ‌పాన్ ప్ర‌జ‌ల‌కి ఎంత ప్రేమంటే..!

ప్ర‌భాస్‌పై జ‌పాన్ ప్ర‌జ‌ల‌కి ఎంత ప్రేమంటే..!

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా స‌త్తా చాటారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. సాహో సినిమా ప్ర‌భాస్‌ని అభిమానుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. మ‌న క‌న్నా కూడా జ‌పాన్‌లో ప్ర‌భాస్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారంటే అతిశ‌యోక్తి కాదేమో..! ఆయ‌న బ‌ర్త్‌డేని వేడుక‌లా జ‌రుపుకోవ‌డం, ప్రభాస్ పోస్ట‌ర్స్‌ని ఇంటి నిండా పెట్టుకోవ‌డం, ఆయ‌న పేరుతో టాటూలు వేయించుకోవ‌డం వంటివి చేస్తూ త‌మ అభిమాన న‌టుడిపై ప్రేమ‌ని ఇలా చూపించుకుంటున్నారు.

గతంలో చైనాలో ప్రభాస్ అభిమానులు ఆయ‌న‌‌ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మేవారు. కొంద‌రు బాహుబ‌లి సినిమాలోని క్యారెక్ట‌ర్ పేర్ల‌తో ఫుడ్ ఐట‌మ్స్ విక్ర‌యించారు. ఇక ఇప్పుడు ప్రభాస్‌ పేరిట షుగర్‌లెస్‌ మింట్‌ క్యాండీస్‌ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు. జ‌పాన్ అభిమానులు ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తుండ‌గా, నెటిజ‌న్స్ వారి ప్రేమ‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ‘రాధేశ్యామ్‌’  అనే సినిమాతో ప్ర‌స్తుతం బిజీగా ఉండ‌గా, ఆ త‌ర్వాత  ‘మహానటి’ ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ మూవీలో నటించనున్నాడు. దీని త‌ర్వాత  ‘ఆదిపురుష్‌’ అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు.  


logo