బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 05, 2020 , 13:08:14

స‌స్పెన్స్ క్రియేట్ చేస్తున్న 'ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)' టీజ‌ర్‌

స‌స్పెన్స్ క్రియేట్ చేస్తున్న 'ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)' టీజ‌ర్‌

ఇటీవ‌లి కాలంలో విడుద‌ల‌వుతున్న చిన్న చిత్రాలు దాదాపు సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గానే తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏ (ఏ డి ఇన్ఫినిటమ్) అనే చిత్రాన్ని విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు.  నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా టీజ‌ర్ విడుదల చేశారు.

సంతోషంగా ఉన్న కుటుంబంలో బాలిక మిస్సింగ్ ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆ బాలిక‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు. ఎలా మిస్ అయింది అనే విష‌యాల‌పై టీజ‌ర్ ద్వారా స‌స్పెన్స్‌ని క‌లిగిచారు. ఎంతో హృద్యంగా సాగిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది. ఈ చిత్రానికి యుగంధర్ దర్శకత్వం వహించగా, విజయ్ కూరాకు సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. logo