సోమవారం 01 జూన్ 2020
Cinema - May 20, 2020 , 23:08:44

కలయా నిజమా

కలయా నిజమా

నితిన్‌ ప్రసన్న, ప్రీతి అశ్రాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏ’(ఏడీ ఇన్ఫినిటిమ్‌). అవంతిక ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్‌ ముని దర్శకుడు.  ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మెడికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. వాస్తవానికి కల్పనకు మధ్య జరిగిన సంఘర్షణలో కొంతమంది యువతీయువకులకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. నితిన్‌ ప్రసన్న పాత్ర మూడు భిన్న పార్శాలతో సాగుతుంది. ఫిల్మ్‌ స్కూల్‌ నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుడు యుగంధర్‌ ముని నవ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో టీజర్‌ను విడుదలచేస్తాం’ అని తెలిపారు.  ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కె బంగారి, సౌండ్‌ డిజైన్‌: వినిల్‌ అమక్కాడు, పాటలు: అనంత్‌ శ్రీరామ్‌, సంగీతం: విజయ్‌ కురాకుల.


logo