సోమవారం 13 జూలై 2020
Cinema - May 27, 2020 , 11:52:32

అ..ఆ చిత్రానికి హిందీలో సూప‌ర్భ్ రెస్పాన్స్

అ..ఆ చిత్రానికి హిందీలో సూప‌ర్భ్ రెస్పాన్స్

తెలుగు సినిమాల‌కి హిందీలో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. మ‌న‌ సినిమాలు కొన్ని హిందీలో రీమేక్ అవుతుండ‌గా, మ‌రి కొన్ని  డ‌బ్ జ‌రుపుకొని ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి.ఇటీవ‌ల సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ కి సంబంధించిన యూట్యూబ్ ఛాన‌ల్ లో నితిన్ న‌టించిన సినిమాల‌ని హిందీలో డ‌బ్ చేసి అప్ లోడ్ చేశారు. వాటికి 400 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం.  ఇందులో అ.ఆ చిత్రం కూడా ఉంది.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం అ..ఆ. కుటుంబ నేప‌థ్యంతో ఎంతో అందంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల హిందీలో డ‌బ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో మిలియన్‌ లైక్స్‌ వచ్చాయి.  అలానే దాదాపు 20 కోట్ల మంది వీక్షించారు. నితిన్ న‌టించిన  అ ఆ 2 (ఛ‌ల్ మోహ‌న్ రంగ హిందీ వెర్ష‌న్)  , శ్రీనివాస క‌ళ్యాణం కూడా హిందీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాయి. 


logo