బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 06, 2020 , 10:42:45

హ్యాపీ యానివ‌ర్స‌రీ అల్లు అర్జున్

హ్యాపీ యానివ‌ర్స‌రీ అల్లు అర్జున్

ఇటు ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని సంతోషంగా గ‌డిపే సెల‌బ్రిటీస్‌లో అల్లు అర్జున్ ఒక‌రు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, ఎంతో కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీతో గ‌డుపుతుంటాడు. అప్పుడ‌ప్పుడు త‌న కూతురు అర్హ‌, త‌న‌యుడు అయాన్‌తో క‌లిసి చేసే చిలిపి ప‌నులని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటాడు బ‌న్నీ . ఇవి చూసిన నెటిజ‌న్స్ తెగ ఆనంద‌ప‌డుతుంటారు. అయితే మార్చి 6, 2011 ఇటు బ‌న్నీకి, అటు ఆయ‌న భార్య స్నేహారెడ్డి చాలా ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఈ తేదీన ఇద్ద‌రు మూడు ముళ్ళ బంధంతో ఒక్క‌టి అయ్యారు. నేటితో వీరి వివాహం జ‌రిగి 9 ఏళ్ళు పూర్తైన సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న ఇనస్టాగ్రాములో పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ.. రోజులు వేగంగా గ‌డుస్తున్నాయి. ప్రేమ అంత‌కంత పెరుగుతుంద‌ని పేర్కొన్నాడు. బ‌న్నీకి నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ చిత్రం చేస్తున్నాడు.logo