మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 15:13:10

స్టార్ హీరోకు ‘9’ నంబ‌ర్ సెంటిమెంట్‌..!

స్టార్ హీరోకు ‘9’ నంబ‌ర్ సెంటిమెంట్‌..!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న టైంలోనూ ప్ర‌జ‌లంద‌రికీ స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేందుకు మేక‌ప్ వేసుకుని యాడ్ లో న‌టించాడు. ప్ర‌స్తుతం త‌న కొత్త చిత్రం బెల్ బాట‌మ్ షూటింగ్ కోసం స్కాట్లాండ్ కు వెళ్లింది. అక్ష‌య్ తోక‌లిసి ఫ్యామిలీ కూడా వెళ్లింది. షూట్ ను పూర్తి చేసుకుని అక్ష‌య్ త‌న కుటుంబంతో క‌లిసి వ‌చ్చే వార‌మే ముంబైకు చేరుకోనున్నాడు. ఇక ముంబైకి వ‌చ్చి రాగానే తాను న‌టిస్తోన్న మ‌రో చిత్రం ల‌క్ష్మీబాంబ్ చిత్రం ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేశాడు. లక్ష్మీ బాంబ్ ప్ర‌మోష‌న్స్ ను అక్ష‌య్ కుమార్ అక్టోబ‌ర్ 9న షురూ చేయ‌నున్న‌ట్టు బీటౌన్ టాక్‌. ఈ సారి కూడా 9 నంబ‌ర్ తో ఉన్న తేదీనే అక్ష‌య్ త‌న ప్రోగ్రామ్ ను మొద‌లు పెడుతుండ‌టంతో..అక్ష‌య్ కుమార్ కు 9 నంబ‌ర్ అంటే సెంటిమెంట్ ఉంద‌ని బాలీవుడ్ జనాలు చ‌ర్చించుకుంటున్నారు.

అక్ష‌య్ న‌టిస్తోన్న మ‌రో చిత్రం  పృథ్విరాజ్. మరోవైపు ప్ర‌మోష‌న్స్ అయిపోగానే ఈ సినిమా షూట్ లో జాయిన కానున్నాడు. హిస్టారిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న పృథ్విరాజ్ చిత్రంలో 2017-మిస్ వ‌ర‌ల్డ్‌, న‌టి మానుషి ఛిల్ల‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo