సోమవారం 01 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 15:00:50

తొలి లిప్‌లాక్‌కు 87 ఏళ్లు

తొలి లిప్‌లాక్‌కు 87 ఏళ్లు

లిప్‌లాక్‌లు నేటి సినిమాల్లో కామన్‌గా మారిపోయాయి. ముద్దు సన్నివేశాలు లేకుండా సినిమాలు రూపొందడం లేదంటే అతిశయోక్తి కాదు. తమ సినిమాల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారాస్ర్తాలుగా ఈ లిప్‌లాక్‌లు కొందరు దర్శకనిర్మాతలు ఉపయోగించుకుంటున్నారు. అంతలా ప్రస్తుత సినిమాల్లో లిప్‌లాక్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అయితే భారతీయ చిత్రసీమలో లిప్‌లాక్‌ ఉన్న మొదటి సినిమా ఏదో తెలుసా. మలయాళ చిత్రం మార్తండవర్మ. 1933లో రూపొందిన ఈ చిత్రంలో  ఏవీపీ మీనన్‌, పద్మినిలపై ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు.  ఇండియన్‌ స్క్రీన్‌పై ఇదే తొలి లిప్‌లాక్‌. 87 ఏళ్ల క్రితం ముద్దు సన్నివేశాల  ట్రెండ్‌కు ఈ సినిమా శ్రీకారం పలికింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోతెరకెక్కిన ఈ మూకీ సినిమాకు పీవీ రావుదర్శకత్వం వహించారు. మలయాళ సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమా ఇది. అదే ఏడాది హిందీ చిత్రం కర్మలో నాలుగు నిమిషాల నిడివితో కూడిన ముద్దు సన్నివేశాన్ని నాయకానాయికలు దేవికారాణి, హిమాన్షురాయ్‌లపై చిత్రీకరించారు. ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.   దేవికారాణి,  హిమాన్షురాయ్‌ నిజజీవితంలో భార్యాభర్తలు కావడం గమనార్హం. హిందీ చిత్రసీమలో ఎక్కువ నిడివి కలిగిన లిప్‌లాక్‌గా ఇప్పటికీ కర్మ సినిమా రికార్డు అలాగే ఉంది. 


logo