ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్ లక్ష్యం.పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండే నూతన పోర్టల్ లో తక్షణం ఆదాయపన్ను రిటర్నుల (ఐటిఆర్ల)ప్రాసెసింగ్ నుంచి పన్ను చెల్లింపుదారులకు త్వరగా రిఫండ్ చెల్లించడం వంటి వాటి వరకు ఉన్నాయి. అన్ని లావాదేవీలు, అప్లోడ్లు లేదా పెండింగ్ యాక్షన్స్అన్నీ ఒకే డాష్ బోర్డులో ప్రదర్శించనున్నారు. ఉచితంగా ఐటిఆర్ తయారీ సాఫ్ట్వేర్ ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఇందులో అందుబాటులో ఉంటుంది.
ఇది ఐటిఆర్ 1,4 పన్ను చెల్లింపుదారులకు (ఆన్లైన్, ఆఫ్లైన్) అలాగే ఐటిఆర్ 2 ( ఆఫ్లైన్) వారికి ముందు ఉపయోగపడుతుంది. త్వరలోనే 3,5,6,7 వారికి కూడా ఐటిఆర్ తయారీ ని అందుబాటులోకి తెస్తారు. పన్ను చెల్లింపుదారులుతమ వేతనంతోపాటు ఇంటికి సంబంధించిన ఆస్తి, వ్యాపార, ప్రొఫెషన్ వంటి వాటి ఆదాయానికి సంబంధించిన కొంత సమాచారాన్ని అందించడం ద్వారా వారు ప్రొఫైల్ అప్డేట్ చేయదానికి వీలుకలుగుతుంది.