మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 23:39:47

స్పిన్‌మాంత్రికుడి జీవనం

స్పిన్‌మాంత్రికుడి జీవనం

శ్రీలంక స్పిన్‌మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘800’. మురళీధరన్‌ పాత్రను తమిళ అగ్రనటుడు విజయ్‌ సేతుపతి పోషిస్తున్నారు.  టెస్ట్‌మ్యాచ్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసి ప్రపంచరికార్డు సృష్టించారు మురళీధరన్‌.  ఆ రికార్డును స్ఫురించేలా సినిమాకు ‘800’ టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా తాలూకు మోషన్‌పోస్టర్‌ మంగళవారం విడుదల చేశారు. ఇందులో అచ్చం మురళీధరన్‌లా కనిపిస్తున్నారు విజయ్‌ సేతుపతి. శ్రీలంకలోని ఆనాటి అంతర్యుద్ధ పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ మోషన్‌ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు.  శ్రీలంకలో తమిళ కుటుంబానికి చెందిన ముత్తయ్య మురళీధరన్‌ అనేక ఒడిదుడుకుల్ని అధిగమించి విశ్వక్రికెట్‌లో అద్భుత స్పిన్నర్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన జీవిత కథను ‘800’ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు.  ఈ చిత్రానికి శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. 


logo