బుధవారం 03 జూన్ 2020
Cinema - May 11, 2020 , 11:39:44

ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసం దేవి శ్రీ స‌ర్‌ప్రైజ్ వీడియో

ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసం దేవి శ్రీ స‌ర్‌ప్రైజ్ వీడియో

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్. మే 11,2012న విడుద‌లైన ఈ చిత్రం నేటితో ఎని‌మిదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం, ఫ్యాన్స్ పాత జ్ఞాప‌కాల‌ని నెమ‌ర‌వేసుకుంటున్నారు. చిత్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్ యూఎస్ఏలో జ‌రిపిన కాన్స‌ర్ట్‌లో గ‌బ్బ‌ర్ సింగ్ పాట‌ని ఖాకీ ధ‌‌రించి పాడ‌గా, దానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ వీడియోని కొద్ది సేప‌టి క్రితం షేర్ చేశారు.

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం కోసం దేవి శ్రీ స్వ‌ర‌ప‌ర‌చిన దేఖో దేఖో గబ్బర్ సింగ్.., కెవ్వు కేక.., ఆకాశం అమ్మాయైతే.., పిల్లా నువ్వు లేని జీవితం.., దిల్ సే దిల్ సే.., మందు బాబులం.. సాంగ్స్‌కి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్, కామెడీ, శృతి గ్లామ‌ర్ సినిమా స‌క్సెస్‌లో స‌గ భాగం అయ్యాయి. logo