శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 19:31:23

ఒకే రోజు 8 చిత్రాలు విడుద‌ల‌..జనవరి 29న సినీ జాతర..!

ఒకే రోజు 8 చిత్రాలు విడుద‌ల‌..జనవరి 29న సినీ జాతర..!

థియేటర్స్ ఓపెన్ కావడమే తరువాయి ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న సినిమాలన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఎన్ని సినిమాలు ఉన్నాయి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే అన్ని సినిమాలున్నాయి మరి. లైన్ లో ఉన్న ఒక్కో సినిమా ఇప్పుడు బయటికి వస్తుంది. ముఖ్యంగా జనవరి 29న ఏకంగా 8 సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ థియేటర్స్ లోనే వస్తుండటం విశేషం. అందులో ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.


పునర్జన్మల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో హీరోగా నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు ప్రదీప్. దాదాపు 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. జనవరి 29న విడుదల కానున్న సినిమాల్లో కాస్తో కూస్తో అంచనాలతో వస్తున్న సినిమా ఇదే. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు..మరో 7 సినిమాలు కూడా ఇదే రోజు వస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ ఆమని నటించిన ‘అమ్మదీవెన’, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ టైటిల్ రోల్ పోషించిన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషించిన ‘జైసేన’, నూతన నటీనటులు నటించిన ‘మిస్టర్ అండ్ మిస్’, రొటీన్ కు కాస్త భిన్నంగా కొత్తకథతో తెరకెక్కిన ‘చెప్పినా ఎవరూ నమ్మరు’, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కళాపోషకులు’ సినిమాలు కూడా జనవరి 29నే విడుదల కానున్నాయి. ఇవన్నీ స్ట్రయిట్ సినిమాలు కావడం మరో విశేషం. 


మరోవైపు జనవరి 30వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘అమెరికన్ కమాండోస్’ కూడా విడుదల కానుంది. మొత్తానికి ఇన్ని సినిమాలు ఒకే రోజు రానుండటంతో సినీ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. మరి వీటిలో ఎన్ని ఆడియన్స్ మనసు దోచుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo