అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో సంచలనాల్ని సృష్టిస్తోంది. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ జన్మదినోత్సవం రోజున విడుదలైన ఈ వీడియో తెలుగు చిత్రసీమలో 70మిలియన్ వ్యూస్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా కొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇదని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.