శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 08:47:52

నామినేష‌న్స్ ర‌చ్చ‌.. హాట్ హాట్‌గా డిస్క‌ష‌న్స్

నామినేష‌న్స్ ర‌చ్చ‌.. హాట్ హాట్‌గా డిస్క‌ష‌న్స్

బిగ్ బాస్ హౌజ్‌లో సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ర‌చ్చ మొద‌లవుతుంది. త‌మ‌కు న‌చ్చని ఇద్ద‌రిని ఎంపిక చేసి ఏ విష‌యంలో వారిని నామినేట్ చేస్తున్నారో చెప్పుకొస్తుంటారు. ఈ నామినేష‌న్ స‌మ‌యంలో హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ కూడా జ‌రుగుతుంటాయి. ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు మీరు ఎవ‌రి వ‌ల‌న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ పేర్లు, కార‌ణం చెప్పి ఇద్ద‌రిని నామినేట్ చేయాల‌ని కోరారు. నామినేట్ చేసిన వారి ఫోటోల ప్లేట్స్ ని సుత్తితో ప‌గ‌ల‌గొట్టాని కూడా సూచించారు.  

నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముందు లాస్య మొద‌లు పెట్ట‌గా న‌న్ను క‌న్నింగ్ స్మైల్ అని మాస్ట‌ర్ అన్న కారణంగా ఆయ‌న‌ని నామినేట్ చేస్తున్నాను అలానే మోనాల్ స‌డెన్‌గా నాతో మాట్లాడ‌డం ఆపేస్తుంది అందుకే ఆమెని నామినేట్ చేస్తున్నాను అని పేర్కొంది. అనంతరం అఖిల్‌.. అరియానా  ఇత‌రులు చెప్పేది విన‌దని , అరుస్తూనే ఉంటుంద‌ని ఆ కార‌ణంగా త‌న‌ని నామినేట్ చేస్తున్నా అని పేర్కొన్నాడు. ఇక మాస్ట‌ర్‌ని నామినేట్ చేసిన అఖిల్ సింప‌థీ అనే ప‌దం వాడటం నాకు న‌చ్చ‌లేదు. ఆ కార‌ణంగా నామినేట్ చేశాన‌ని పేర్కొన్నాడు. 

ఇక మెహబూబ్.. అరియానా, మోనాల్‌ల‌ని నామినేట్ చేయగా,   అవినాష్.. లాస్య, హారికల‌ని, అమ్మా రాజశేఖర్.. అఖిల్, లాస్యల‌ని, అరియానా.. మెహబూబ్, అఖిల్‌ల‌ని,  సొహైల్.. అరియానా, రాజశేఖర్‌ల‌ని  నోయల్.. మెహబూబ్, అఖిల్‌ల‌ని,  అభిజిత్.. మోనాల్ గజ్జర్, అమ్మా రాజశేఖర్‌ల‌ని,  హారిక.. అరియానా, మెహబూబ్‌ల‌ని, మోనాల్ గజ్జర్.. మెహబూబ్, లాస్య ల‌ను నామినేట్ చేశారు.