సోమవారం 01 జూన్ 2020
Cinema - May 08, 2020 , 08:54:26

6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్ల ఖ‌ర్చు..!

6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్ల ఖ‌ర్చు..!

తెలుగు సినిమాల స్థాయి పెర‌గ‌డంతో టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా నిర్మాత‌లు బ‌డా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తుండ‌గా, వాటి కోసం ఎంత ఖ‌ర్చైన వెనుకాడ‌డం లేదు. తాజాగా బన్నీ ప్ర‌ధాన పాత్ర‌లో పుష్ప అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. శేషాచలం అడవుల్లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేయబడింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ భారీగా డిజైన్ చేసారంట సుకుమార్. 6 నిమిషాలు ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.  రాయలసీమ చిత్తూరు యాస భాషతో బ‌న్నీ అద‌రగొట్ట‌నున్నాడ‌ట‌. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి సంగీతం అందిస్తున్నారు


logo