మంగళవారం 02 జూన్ 2020
Cinema - May 14, 2020 , 17:17:43

4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్..!

4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్..!

టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఈర్ తాజాగా నాలుగు మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకున్నాడు. సోష‌ల్ మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా లేక‌పోయిన అడ‌పా ద‌డ‌పా పోస్ట్‌లు షేర్ చేసే ఎన్టీఆర్‌కి ట్విట్ట‌ర్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 4 మిలియ‌న్స్‌కి చేరింది. త‌మ హీరో అరుదైన ఘ‌న‌త సాధించ‌డంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తుండగా, ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన స్పెష‌ల్ వీడియో మే 20న బ‌ర్త్‌డే స్పెష‌ల్‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌న 30వ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే.


logo