నందమూరి బాలయ్య రికార్డులు తిరగరాస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తుండగా, ఇటీవల టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఇది అభిమానులకి మంచి విందు భోజనంగా అనిపించింది.దీంతో రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం విడుదలైన పదకొండు రోజుల్లోనే అఖండ టీజర్ సీనియర్ స్టార్ హీరోల టీజర్ల రికార్డులను క్రాస్ చేసేసింది. గతంలో తలైవా రజినీకాంత్ నటించిన కబాలి సినిమా టీజర్ ఇప్పటివరకు 38మిలియన్స్ తో టాప్ లో ఉండగా, ఇప్పుడు అఖండ 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి షాకిచ్చింది.
బాలయ్య – బోయపాటి శీను సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇదివరకే ఇద్దరూ కలిసి సింహా, లెజెండ్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. మే 28న చిత్రం విడుదల కానున్నట్టు ప్రకటించిన, ఈ టైంకి రావడం కష్టమేనని అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇవికూడా చదవండి..