శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 19:27:40

ఫిబ్రవరి 12..మోస్ట్ వాంటెడ్ డేట్..ఒకే రోజు 4 సినిమాలు

ఫిబ్రవరి 12..మోస్ట్ వాంటెడ్ డేట్..ఒకే రోజు 4 సినిమాలు

సంక్రాంతి సినిమాలు చేసిన బిజినెస్.. వాటికి వచ్చిన వసూళ్లు చూసిన తర్వాత నిర్మాతల్లో ఫుల్లుగా నమ్మకం వచ్చేసింది. ఇక థియేటర్స్ కు జనం వస్తారు.. ఇకపై ప్రశాంతంగా సినిమాలు విడుదల చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని సంక్రాంతి అందరికీ ఇచ్చేసింది. ముఖ్యంగా మాస్టర్ సినిమాకు అయితే మునపటి మాదిరే వసూళ్లు రావడం.. ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ కేవలం 7 రోజుల్లోనే రావడంతో దర్శక నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. మరోవైపు క్రాక్ సినిమాకు కూడా రెండు వారాల్లోనే 35 కోట్ల వరకు షేర్ వచ్చింది. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌‌బస్టర్. 

పండగ సినిమాల తర్వాత మరిన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వాలెంటైన్ వీకెండ్ ను చాలా మంది నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న 4 సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకేరోజు నాలుగు సినిమాలు వస్తున్నాయంటే పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అందులో రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి. రెండు మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా వస్తున్నాయి. మరి అవేంటి.. వాటిపై ఉన్న ఆసక్తి ఏంటి చూద్దాం.. 


1. ఉప్పెన: చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఫిబ్రవరి 12న డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. 

2. చక్ర: యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న చక్ర సినిమా కూడా ఫిబ్రవరి 12నే విడుదల కానుంది. అభిమన్యుడు తర్వాత మరోసారి ఈయన టెక్నికల్ థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్న సినిమా ఇదే. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్. 


3. FCUK: సీనియర్ హీరో జగపతిబాబు నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ FCUK. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. 

4. శశి: ఆది సాయికుమార్ నటిస్తున్న శశి సినిమా సైతం అదే రోజు రానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo