ఈ రోజుల్లో మేకింగ్ స్టైల్ చాలా మారింది. సినిమా హిట్టా, ఫ్లాపా అన్నది పక్కన పెడితే మేకర్స్ సినిమా ప్రమోషన్స్, షూటింగ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. తెలుగు సినిమాలకే వేల కోట్లు ఖర్చుచేస్తుంటే ఇక హాలీవుడ్ సినిమాలకి ఎంత ఖర్చు పెడతారనేది మీరే ఊహించండి.తాజాగా డేనియల్ క్రేగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న నో టైమ్ టూ డై సినిమాలోని పోరాట సన్నివేశాల కోసం ఏకంగా 50 లక్షల రూపాయాలు ఖర్చు చేశారట.
నో టైమ్ టై డై సినిమాలో పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ని తెప్పించేలా ఉంటాయి. వాటి కోసం సుమారు 32 వేల లీటర్ల కూల్‌డ్రింక్‌ను వెదజల్లారట. దీని కోసం రూ.50 లక్షలుపైనే ఖర్చుపెట్టారు. కూల్ డ్రింక్స్ ఎందుకు వాడారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ మారిసన్
ఇటలీ వీధుల్లో చేసే మోటర్‌బైక్ స్టంట్స్ కోసం ఇలా చేశారట. స్టంట్స్ చేసిన ఇటలీ వీధుల్లో బండి జారకుండా ఉండేందుకు కూల్‌డ్రింక్‌ను పోశాం. అది కొద్ది సేపటికి ఆరిపోతుంది. అప్పుడు ఆ ప్రాంతమంతా జారుడు స్వభావం బాగా తగ్గిపోతుంది. దీంతో బైక్ విన్యాసాలు చేయడం సులువు అవుతుంది’’అని చెప్పారు.