బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 21, 2021 , 18:06:49

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ఉందంటే..?

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ఉందంటే..?

కొన్ని సినిమాలు ట్రైలర్ విడుదలయ్యే వరకు కూడా లోపల ఏముందో తెలియదు.. కథ అర్థం కాదు. యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా పరిస్థితి కూడా అంతే. ఈయన హీరోగా నటిస్తున్నాడనే మాటే కానీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం అంతగా లేవు. అయితే నీలినీలి ఆకాశం పాట సంచలనం సృష్టిచండంతో ఈ సినిమా వస్తున్నట్లు అర్థమైంది. మున్నా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

జనవరి 29న విడుదల కానుంది 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ఈ సినిమాను గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే సినిమాలో విషయం చాలానే ఉందని ట్రైలర్ చూస్తున్నపుడే అర్థమైపోతుంది. కచ్చితంగా ఇందులో మ్యాటర్ కూడా చాలానే ఉందని తెలుస్తుంది కూడా.

లవ్ స్టోరీకి పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు మున్నా. ఆ జన్మలో కలవని జంట..ఈ జన్మలో ఎలా కలిసారనే కాన్సెప్టుతో సినిమా వస్తుంది. ఈ క్రమంలోనే నాటికి నేటికి లింక్ పెడుతూ..అందులోనే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రమైన లాజిక్ పెట్టాడు దర్శకుడు. దాన్నే ట్రైలర్ లోనూ చూపించాడు. అమృత అయ్యర్ కూడా ఈ సినిమాలో బాగానే రెచ్చిపోయింది.

పాటలో కనిపించినంత పద్దతిగా మాత్రం ట్రైలర్ లో లేదు. అమ్మడు స్విమ్మింగ్ పూల్ షాట్స్ తో పాటు అదిరిపోయే గ్లామర్ షో కూడా చేసింది. అంతేకాదు హీరో ప్రదీప్ తో లిక్ లాక్ సీన్ కూడా చేసింది. అన్ని కమర్షియల్ హంగులతోనే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాను తీర్చిదిద్దారు. ఈ ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేసాడు. మరి చూడాలిక.. జనవరి 29న రాబోయే ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించబోతుందో..?


ట్రైల‌ర్ పై ఓ లుక్కేయండి మ‌రి..లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo