మంగళవారం 07 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 22:50:59

అమలాపురం నుంచి అమెరికా వరకు

అమలాపురం నుంచి అమెరికా వరకు

ప్రదీప్‌ మాచిరాజు కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. ఎస్వీ బాబు నిర్మాత. మున్నా దర్శకుడు. అమృత అయ్యర్‌ కథానాయిక. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు యూట్యూబ్‌లో 150 మిలియన్లకుపైగా వ్యూస్‌ లభించాయి. చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని  సిద్‌ శ్రీరామ్‌, సునీత ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌  సంగీతాన్ని అందించారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘అమలాపురం నుంచి అమెరికా వరకు అందరికి నచ్చిన పాట ఇది. స్టార్లు లేని  చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.  ‘ సినిమాకు సంబంధించిన అన్ని  కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్షోభం సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రాన్ని జీఏ2, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు విడుదలచేయనున్నాయి. 


logo