ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 02:46:08

పదేళ్ల కష్టానికి ప్రతిఫలమిది

పదేళ్ల కష్టానికి ప్రతిఫలమిది

‘హీరోగా ప్రేక్షకుల్ని మెప్పించగలనా? వారిని నవ్విస్తానా?లేదా? అనే భయాలతోనే ప్రతిరోజు షూటింగ్‌కు వెళ్లాను. దర్శకనిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగా’ అని అన్నారు ప్రదీప్‌ మాచిరాజు. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకుడు. ఎస్వీబాబు నిర్మాత. అమృతా అయ్యర్‌ కథానాయిక.  ఈ నెల 29న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ ‘కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇది. హీరోగా మారడానికి పదేళ్లు పట్టింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చా’ అని చెప్పారు.  పాటలు పెద్ద విజయాన్ని సాధించాయని, సినిమా కూడా అదే స్థాయిలో హిట్‌గా నిలవాలని దర్శకుడు మారుతి ఆకాంక్షించారు. అమృతా అయ్యర్‌ మాట్లాడుతూ ‘నా ప్రతిభాపాఠవాలపై ఉన్న నమ్మకంతో ఆడిషన్‌ చేయకుండా దర్శకుడు మున్నా ఈ సినిమాలో అవకాశమిచ్చారు’ అని చెప్పింది.  లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డ తరుణంలో ‘నీలి నీలి ఆకాశం..’ పాట మా కష్టాల్ని మరపించిందని, పదేళ్ల శ్రమకు  ఈ సినిమా ప్రతిరూపమని దర్శకుడు మున్నా అన్నారు. 

VIDEOS

logo