ఒక్క సినిమా కోసం ముగ్గురు స్టార్లు రంగంలోకి దిగుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాఇది నిజం. ఇంతకీ ఏంటాసినిమా అంటే మేజర్. టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా నటిస్తోన్న మేజర్ సినిమా టీజర్ సాయంత్రం 4గంటల5 నిమిషాలకు విడుదల కానుంది. ఈ టీజర్ ని ముగ్గురు స్టార్లు విడుదల చేయబోతున్నారు.
తెలుగులో మహేష్ బాబు , హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీ చేతుల మీదుగా ఈ టీజర్ రాబోతోంది. ప్యాన్ ఇండియామూవీగా మేజర్ తెరకెక్కుతోంది. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేజర్ సినిమా జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.