మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jul 21, 2020 , 15:01:44

చిరంజీవి చిత్రంలో ముగ్గురు భామ‌లు..!

చిరంజీవి చిత్రంలో ముగ్గురు భామ‌లు..!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తోన్నచిత్రం ఆచార్య. ఈ సినిమాతో అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రోసారి చిరంజీవికి జోడీగా న‌టిస్తోంది. ఈ మూవీలో రాంచ‌ర‌ణ్ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. రాంచ‌ర‌ణ్ కు జోడీగా కైరా అద్వానీ కానీ లేదా జాన్వీక‌పూర్ న‌టించ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. కైరా అద్వానీ సినిమాలో న‌టించేందు‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా..షూటింగ్ కు అనుగుణంగా కైరా డేట్స్ స‌ర్దుబాటు కావాల్సి ‌ఉంది. మ‌రోవైపు జాన్వీక‌పూర్ కూడా లైన్‌లో ఉంది.

మొత్తానికి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో దాదాపు ఖాయ‌మైన‌ట్టేన‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మ‌రో భామ రెజీనా క‌సాండ్రా ఐటెం సాంగ్ లో క‌నిపించ‌నుంది. చిరు ప్రాజెక్టు మొద‌లైన‌ప్ప‌టి నుంచి చాలా మంది హీరోయిన్ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇపుడు ఫైన‌ల్ గా ఈ మూవీలో ముగ్గురు భామ‌లు సంద‌డి చేయ‌నున్నార‌న్న‌మాట‌. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.