శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 15:28:37

“చిరంజీవి”oచిన చిత్రం 'ఆపద్బాంధవుడు@ 28 సంవత్సరాలు '

“చిరంజీవి”oచిన చిత్రం 'ఆపద్బాంధవుడు@ 28 సంవత్సరాలు '

చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం ఆప‌ద్బాంధ‌వుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది . అలాగే  5 నంది అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రంలో చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరంజీవి పాత్ర . మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు . అలాగే ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి . 

కె.విశ్వనాథ్‌ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం ఆప‌ద్బాంధ‌వుడు. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్‌ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి,  చివరి చిత్రం ఇదే కావ‌డం విశేషం .