బాలీవుడ్ తార సన్నీలియోన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. సైకలాజికల్ థ్రిల్లర్ వస్తోన్న షీరో చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. నేడు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ షేర్ చేసింది సన్నీలియోన్. ముఖంపై గాయాలతో తలకిందులుగా సన్నీలియోన్ కనిపిస్తుండగా..పక్కనే డార్క్ నైట్‌లో మెట్లపై ఓ చిన్నారి కూర్చోవడం మోషన్ పోస్టర్ లో చూడొచ్చు.
షీరోలో భాగస్వామ్యం కావడం చాలా ఎక్జయిటింగ్ గా ఉంది. శ్రీజిత్ విజయన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా..తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సన్నీలియోన్ ప్రస్తుతం స్పిట్స్ విల్లా రియాలిటీ షో కోసం కేరళలో చక్కర్లు కొడుతోంది. రన్విజయ్ సిన్హాతో కలిసి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.