బుధవారం 03 జూన్ 2020
Cinema - May 17, 2020 , 15:39:27

211 మంది సింగ‌ర్స్ పాడిన జయతు జయతు భారతం..

211 మంది సింగ‌ర్స్ పాడిన  జయతు జయతు భారతం..

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్ర‌జ‌లంతా ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. ఆప‌ద‌లో ఉన్నవారికి కొంద‌రు సాయం చేస్తుండ‌గా, క‌రోనా నిర్మూల‌న‌లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్న అత్య‌వ‌స‌ర సేవాసిబ్బందికి మ‌రి కొంద‌రు ధైర్యాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా సెల‌బ్రిటీలు క‌లిసిక‌ట్టుగా పాట‌లు పాడుతూ, అనేక షార్ట్‌ఫిలింస్ రూపొందిస్తున్నారు తాజాగా క‌రోనా క‌ట్టడి కోసం ఒక్క‌టైన భారతీయుల‌కి సెల్యూట్ చేస్తూ 211మంది సినీ గాయ‌కులు జయతు జయతు భారతం.. వాసుదేవ్ కుతుంబక్కం అనే సాంగ్ ఆల‌పించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో దిగ్గజ గాయని ఆశా భోంస్లే, సోనూ నిగమ్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. శంకర్‌ మహదేవన్‌, ప్రసూన్‌ జోషి ర‌చించారు.14 భాషల్లోఈ చారిత్రాత్మక గీతం అంకితం చేయ‌బ‌డింద‌ని ఆశాభోంస్లే పేర్కొన్నారు.logo